ePaper
Sunday, October 18, 2026
📄 ePaper
Homeతెలంగాణదివ్యాంగుడిని తోసేసిన ఆర్డీఓ వ్యక్తిగత సిబ్బంది!

దివ్యాంగుడిని తోసేసిన ఆర్డీఓ వ్యక్తిగత సిబ్బంది!

📰 Generate e-Paper Clip

తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్

లేకపోతే ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక

మన తొలి వెలుగు | రంగారెడ్డి : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దివ్యాంగుడిని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వ్యక్తిగత సహాయకుడు తోసివేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. దివ్యాంగుడి పట్ల జరిగిన ఈ వ్యవహారం అమానుషం, అవమానకరమని సోషల్ జస్టిస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన దివ్యాంగుడితో సిబ్బంది వ్యవహరించిన తీరు ఖండించదగినదన్నారు. ప్రజల సమస్యలు వినాల్సిన అధికార యంత్రాంగం ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. బాధ్యుడైన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వ్యక్తిగత సహాయకుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఎమ్మెస్ యాదవ్ డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే, పెద్ద సంఖ్యలో దివ్యాంగులతో కలిసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!