ధర్మవరం ఉప సర్పంచ్ సూర్యం
మన తొలివెలుగు | వాజేడు ప్రతినిధి వై. సర్వేశ్వర రావు (4అక్టోబర్2026) :
ధర్మవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయం కోసం రైతులకు తగినంత (3-ఫేస్) విద్యుత్ సరఫరా సరిగా అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నందున రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు, మరల రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 4:00 గంటల వరకు క్రమం తప్పకుండా 3-ఫేస్ కరెంట్ అందజేయాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ధర్మవరం ఉప సర్పంచ్ సూర్యం ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం సమర్పించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో పంటలకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది, విద్యుత్ సమస్య వల్ల పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు సత్యనారాయణ, శ్రీను, నర్సింహులు, రమేష్, సూరిబాబు సాంబశివ, రాము, రమణయ్య, కోటేశ్వరరావు, సుధాకర్, శ్రీనివాస్, చిన్నల దామోదర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

