మన తొలివెలుగు | మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (04 అక్టోబర్ 2026) :

స్వర్గీయ మాజీ హోంమంత్రి, మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రజా నాయకుడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో ఉన్న ఇంద్రారెడ్డి సమాధి వద్ద ఆయన తనయుడు, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి తదితరులు ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పరితపించిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, పోరాటాలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఇంద్రారెడ్డి సేవలను ఎప్పటికీ మరువలేమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు .

