మన తొలివెలుగు | మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (04 అక్టోబర్ 2026) :
తెలంగాణ మలిదశ ఉద్యమ మార్గదర్శి, మాజీ హోంమంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతిని రాజేంద్రనగర్ నగర్ డైరీ ఫామ్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు కొలన్ సుభాష్ రెడ్డి, డి. రమేష్ ముదిరాజ్, ఉస్కెమూరి నిరంజన్ నేత, జీవన్ దాస్, అరుణ రెడ్డి, రాజు, సదాల శ్రీనివాస్ రెడ్డి, కాట్రగడ్డ వాసుబాబు తదితరులు స్వర్గీయ ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ, కార్మిక శాఖ, హోంశాఖ మంత్రిగా ఇంద్రారెడ్డి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. చేవెళ్ల ప్రాంతంతో పాటు రంగారెడ్డి జిల్లా అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని, పదవుల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం అని భావించిన నిజమైన ప్రజా నాయకుడు ఇంద్రారెడ్డి అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం నాడు ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు.

