ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeతెలంగాణధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం - కే ఎల్ ఆర్

ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం – కే ఎల్ ఆర్

📰 Generate e-Paper Clip

రైతు ప్రభుత్వంలో అన్నదాతలకు ఇబ్బంది రానివ్వం

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

 

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ కొనుగోళ్ల కేంద్రాల వద్ద రాజకీయం, రాద్దాంతం చేస్తూ…. అన్నదాతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని లక్ష్మారెడ్డి చెప్పారు.

మహేశ్వరం, కందుకూరు మండలాల వ్యవసాయ అధికారులతో కిచ్చెన్న మాట్లాడారు. అకాల వర్షాలు వచ్చినా.. ప్రతీ గింజ కొనేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

అవసరమైతే కాంగ్రెస్ నాయకులు కూడా కొనుగోలు కేంద్రాల పరిశీలించి రైతులకు ఇబ్బందులు రాకుండా అండగా ఉండాలని సూచించారు. వేసవి తాపంతో అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా సహయం చేయాలని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రుణాలు మాఫీ చేశామని.. బోనస్ ఇస్తున్నా… సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

గత బీఆర్ఎస్ పాలనలో రైతు రుణాలను మాఫీ చేయలేదు… అన్నదాతలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏం మోఖం పెట్టుకుని కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తున్నారని లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!