ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లానైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను పెంచుతాయి 

నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను పెంచుతాయి 

📰 Generate e-Paper Clip

అదనపు కలెక్టర్ భాస్కరరావు 

మన తొలి వెలుగు యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన వంటి నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర రావు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన క్రీడల వారోత్సవాలలో భాగంగా “ఉద్యోగం సాధన కనెక్టింగ్ టాలెంట్ విత్ ఒప్పోర్ట్యూనిటీస్” సమికృత కార్యాలయం కలెక్టరెట్ మీటింగ్ హాల్ లో ఉద్యోగం సాధన అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ సర్టిఫికెట్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్న యువత ఉంది, కానీ చాలాసార్లు సరైన అవకాశాలు తెలియక వారు తమ ప్రతిభను పూర్తిగా చూపించలేకపోతున్నారని అన్నారు. మరోవైపు, అనేక సంస్థలు నైపుణ్యం కలిగిన వ్యక్తులను వెతుకుతున్నాయని ఈ రెండింటిని కలిపే వంతెనే “ఉద్యోగ సాధన”. విద్య మాత్రమే కాకుండా, నైపుణ్యాభివృద్ధి కూడా ఈ రోజుల్లో చాలా అవసరమన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన వంటి నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని యువత తమ ప్రతిభను గుర్తించి, దానికి తగిన శిక్షణ పొందాలన్నారు. జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం అభివృద్ధి చెందుతోందని ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్‌షిప్స్ వంటి అవకాశాలు యువతకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల యువత కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవచ్చని ఉద్యోగం అనేది కేవలం జీవనోపాధి మాత్రమే కాదు అది ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తి. ఉద్యోగం ద్వారా వ్యక్తి కుటుంబానికి, సమాజానికి, దేశానికి సేవ చేయగలడని కాబట్టి యువత నిరాశపడకుండా తమ ప్రతిభను మెరుగుపరుచుకుని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!