ePaper
Saturday, September 19, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిబీఆర్ఎస్ నాయకుడు భూషణం మరణం కుటుంబానికి తీరని లోటు 

బీఆర్ఎస్ నాయకుడు భూషణం మరణం కుటుంబానికి తీరని లోటు 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మహేశ్వరం గ్రామ మాజీ వార్డు సభ్యుడు సీనియర్ నాయకుడు పెయ్యల భూషణం అనారోగ్య కారణాలవల్ల గత రాత్రి హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం గ్రామం చేరుకొని భూషణం అంతిమయాత్రలో పాల్గొని కడసారి వీడ్కోలు పలికి వారికి ఘన నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతూ భూషణం లేని లోటు ఎవ్వరు తీర్చలేనిదని వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వారితో పాటు గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ , బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య , మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం , సిరిగిరిపురం సర్పంచ్ డి, శ్రీనివాస్ , మాజీ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, పిఎసిఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్ , వార్డు సభ్యులు స్వర్ణగంటి సంజీవ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!