ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeచాంద్రాయణ గుట్టయువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా శివచంద్రగిరి

యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా శివచంద్రగిరి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ :

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు నూతన నియామకాలు ప్రకటించారు. బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా శివచంద్రగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన శివచంద్రగిరి నియామకం అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, గంగాపురం కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. యువతలో పార్టీని బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఈ నియామకాలు చేశామని పార్టీ వర్గాలు తెలిపాయి. నియామకంపై శివచంద్రగిరి హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీ అధినాయకత్వం విశ్వాసాన్ని నిలబెడతానని, యువత సమస్యలపై నిరంతరం పోరాడతానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!