ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

అదనపు కలెక్టర్ భాస్కరరావు

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 55 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 40, మున్సిపాలిటీ 5, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, జిల్లా పంచాయతీ 2, జిల్లా విద్యా శాఖ 2, కో-ఆపరేటివ్, ఎస్సీ కార్పొరేషన్, చేనేత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, శాఖలకు ఒక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ.ఓ శోభారాణి , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!