ePaper
Monday, May 4, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిప్రజల హృదయాల్లో నిలిచిన కీర్తిశేషులు తర్రే మల్లేష్ యాదవ్, బీజేపీ అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి

ప్రజల హృదయాల్లో నిలిచిన కీర్తిశేషులు తర్రే మల్లేష్ యాదవ్, బీజేపీ అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, ప్రతినిధి ముత్తయ్య 

ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసి ప్రజల హృదయాల్లో నిలిచిన కీర్తిశేషులు తర్రే మల్లేష్ యాదవ్, బీజేపీ అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి అని వారి లేని లోటు తీర్చలేదని పలువురు బీజేపీ పెద్దలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్ పెట్ సర్కిల్ లో గల నాదర్గుల్ డివిజన్ నాదర్గుల్ గ్రామ వాస్తవ్యులు మాజీ ఎంపీటీసీ సభ్యుడు ,బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కీర్తిశేషులు తర్రే మల్లేష్ యాదవచ, బడంగ్ పెట్ క్లస్టర్-1 అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి సంతాప సభను బడంగ్ పేట్ క్లస్టర్ 1, 2 బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తోట ఎట్ట రెడ్డి గార్డెన్స్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు హాజరై మల్లేష్ యాదవ్ , రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారందరూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని అందించి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ మోర్చాల నాయకులు, వివిధ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!