ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeమహేశ్వరందొంగ ఓటర్లను తొలగించాలి 

దొంగ ఓటర్లను తొలగించాలి 

📰 Generate e-Paper Clip

మహేశ్వరం నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్ కు వినతి

రోహింగ్యాల ఓట్లను సైతం గుర్తించాణన్న శ్రీరాములు అందెల

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మహేశ్వరం నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ.నారాయణరెడ్డి ని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ కోరారు. దొంగ ఓట్లను తొలగించాలని బీజేపీ నాయకులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పహాడీషరీఫ్, షాహీన్ నగర్, జల్ పల్లి డివిజన్ లలో కుప్పలు తెప్పలుగా దొంగ ఓట్లు ఉన్నాయని, రోహింగ్యాల ఓట్లను సైతం గుర్తించామని కేవలం 26 బూత్ లలో 9960 ఓట్లను గుర్తించామన్నారు‌. గుర్తించినటువంటి దొంగ ఓట్ల జాబితాను అందజేశామన్నారు. ఒక్క ఓటు రెండు మూడు సార్లు ఒకే బూత్ లో ఉన్నాయని, తండ్రికి సంబంధం లేకుండా తల్లికి సంబంధం లేకుండా 18 నుండి 25 సంవత్సరాల సింగిల్ ఓట్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని.. అలాగే హిందువుల ఇండ్లపై ఆ ఇంటికి సంబంధం లేని ఒక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయని, బాలాపూర్ లోని రాయల్ కాలనీ కి సంబందించిన 392, 393 బూత్ లలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు కూడా ఓట్లు ఉన్నాయని వాటిని కూడా గుర్తించామని పేర్కొన్నారు. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే తండ్రికి 41 సంవత్సరాలు ఉంటే కూతురికి 39 సంవత్సరాలు ఉండడం ఇలాంటి ఓట్లు కూడా గుర్తించామని కలెక్టర్ కి వివరించామని తెలిపారు. వచ్చే నెల 25 న ఎస్ఐఆర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించి బీఎల్ఓ లతో పూర్తి విచారణ జరిపించి దొంగ ఓట్లు తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ బీఎల్ఎ -2 అంబోజి శ్రీనివాస్ , బీజేపీ సీనియర్ నాయకుడు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజమోని రాజు ముదిరాజ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!