ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeమహేశ్వరంఆధునిక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి

ఆధునిక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

యువత, విద్యార్థుల క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించాలి

మన తొలివెలుగు: మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

గ్రామ యువత శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు అత్యవసరమని, మహేశ్వరం మండల కేంద్రంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్, పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక క్రీడలు యువజన సర్వీసులు, మత్స్య సంస్థ శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ముదిరాజ్ ని కలిసి మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో క్రికెట్ గ్రౌండ్ నూతన నిర్మాణం చేయవలసిందిగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు 200 వందల మందికి పైగా యువకులు క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారని, కానీ సరైన మైదానం లేకపోవడం వల్ల ఖాళీ స్థలాల్లో, రోడ్ల పక్కన ఆడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ యువత శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం ఈ గ్రౌండ్ ఏర్పాటు అత్యవసరమని, చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షుడు బంగారుగల్ల లాజర్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 11వ వార్డ్ ఇన్చార్జ్ గదగూటి జంగయ్య ముదిరాజ్, మహేశ్వరం గ్రామ 10 వ వార్డు ఇంచార్జ్ కాకి మల్లేష్ ముదిరాజ్, నాయకులు మోత యాదయ్య, గగనం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!