ePaper
Thursday, September 17, 2026
📄 ePaper
Homeతెలంగాణకాషాయం గూటికి మాజీ మున్సిపల్ చైర్మన్..?

కాషాయం గూటికి మాజీ మున్సిపల్ చైర్మన్..?

📰 Generate e-Paper Clip

ఒక ఎంపీ అధ్వర్యంలో హైదరాబాద్ బీజేపీ పెద్దలతో చర్చలు..!

తన వర్గం వారు ఓకే అంటే మూహూర్తం పీక్స్

మన తొలివెలుగు, గద్వాల బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్ :

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. అలాగే నడుస్తుంది ప్రస్తుత గద్వాల రాజకీయం. గతంలో మున్సిపల్ చైర్మన్ గా పదవి అనుభవించిన ఒక నేత గత ఓటమి తర్వాత జీర్ణించుకోలేక తను రాజకీయంగా ఎలాగైన పుంజుకోవాలనే తపనతో ఇప్పుడు బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఒక ఎంపీ అధ్వర్యంలో బీజేపీ అగ్ర నాయకులతో మంతనాలు జరిపినట్లు వినికిడి. కగా ఇట్టి విషయంపై ఇప్పటికైతే ఆ మాజీ మున్సిపల్ చైర్మన్ బయటకు పొక్కకుండ లోలోపల తనకు అనుకూలమైన వర్గంతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతా ఓకే అయితే తన వర్గంతో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆధికారం లేకపోవడంతో తన వర్గం వారు ఒక్కొక్కరుగా బయటకు పోతున్న నేపథ్యంలో ఇక తన భవిష్యత్తు ఇరకాటంలో పడే పరిస్థితి ఉందని గ్రహించిన ఆ మాజీ మున్సిపల్ చైర్మన్.. ఇక ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ఆధికారంలో ఉన్నందున అందులో చేరితే కనీసం రాజకీయ మనుగడ నిలబెట్టుకోవచ్చని ఆ మాజీ మున్సిపల్ చైర్మన్ భావిస్తునట్లు తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్న ప్రస్తుత పార్టీలోనే ఇంకో వర్గం వారు మాత్రం ఆయనది ఏమీరా తిమ్మా అంటే ఎప్పుడు ఆటనే అన్నట్లు ఆయన పార్టీలు మారడం కొత్తేమి కాదని, ఎక్కడ ఆధికారం ఉంటే ఆ చైర్మన్ అక్కడ టవల్ వేస్తాడన్నది గద్వాల పట్టణంలో నానుడని, అందరికి తెలుసిందేనని, ఆ మాజీ చైర్మన్ మా పార్టీలో ఉన్న లాభంలేదు, లేకున్నా లాభం లేదని, బీజేపీ పార్టీ లోకి మారితే మాకుగానీ మా పార్టీకిగాని వచ్చిన నష్టం లేదని తనకంటూ ఏ క్యాడర్ ఉందో? గద్వాల పట్టణంలో జరిగిన ఎన్నికల పలితల్లో అందరికి అర్దమైందన్న విషయం ఆ మాజీ చైర్మన్ అంతర్మదనం చేసుకుంటే బాగుంటుందని, ప్రస్తుతం అదే పార్టీలోని నేతలు సెటైర్లు వేస్తున్నారు. కాగా అదే మాజీ చైర్మన్ వర్గం వారు మాత్రం అలాంటిది ఏమీ లేదు.. ఇవన్ని అబద్ధాలని, ఒట్టి ప్రాపగండా అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఎమైన ఇది నిజమా..? అబద్ధామా..? అనేది అన్యం, పుణ్యం ఆ జములమ్మవ్వకే ఎరుకని పట్టణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!