ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeఎల్బీనగర్ప్రియదర్శిని పార్క్‌లో ₹.19.50 కోట్లతో నూతన ఎస్టీపీ ప్లాంట్ పనులు ప్రారంభం

ప్రియదర్శిని పార్క్‌లో ₹.19.50 కోట్లతో నూతన ఎస్టీపీ ప్లాంట్ పనులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

నిర్మాణ పనులను పరిశీలించిన టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి

మన తొలివెలుగు | ఎల్‌బీనగర్:

లింగోజిగూడ డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని పార్క్ వద్ద రూ.19.50 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టీపీసీసీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన పనులను స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..  నూతన ఎస్టీపీ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన అనంతరం సరూర్ నగర్ చెరువులోకి మురుగునీరు చేరకుండా అరికట్టేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుపరుస్తూస్తూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మధు యాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో లింగోజిగూడ డివిజన్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కిషోర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీనాథ్, అమీర్, విష్ణు, గివర్ధన్, శ్రీకాంత్, సురేష్ బాబు, అమిత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!