ePaper
Saturday, September 19, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్రాజీవ్ గృహకల్పలో హైస్కూల్ ఏర్పాటు చేయాలి

రాజీవ్ గృహకల్పలో హైస్కూల్ ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు | అల్మాస్‌గూడలోని రాజీవ్ గృహకల్ప, వైఎస్సార్, జయశంకర్, ఆర్‌ఎంఆర్ కాలనీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు డిమాండ్ చేశారు. శనివారం అల్మాస్‌గూడ అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ దర్బార్‌లో డ్రైనేజీ, దోమల బెడద, బస్సు షెల్టర్ తదితర సమస్యలను ప్రజలు ప్రస్తావించారు. రాజీవ్ గృహకల్ప అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎల్బీనగర్ రింగ్‌రోడ్ మీదుగా బీఎన్‌రెడ్డి వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.జే.పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాలస్వామి, రాష్ట్ర ఇంచార్జ్ కేవీ గౌడ్, సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!