ePaper
Tuesday, October 20, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం 

స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ( 4 అక్టోబర్ 2026) :

స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గ మాజీ హోంమంత్రి, స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా గుడిమల్కాపూర్ పూల మార్కెట్ లోని ఆయన విగ్రహానికి సామ మహేందర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి తెలంగాణ ప్రజల కోసం చేసిన సేవలను, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. చేవెళ్ల ప్రాంత ప్రజల గుండెల్లో పట్లోళ్ల కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోతుందని, ప్రజల కోసమే పనిచేసిన స్వర్గీయ ఇంద్రారెడ్డి గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సామ సురేందర్ రెడ్డి, వీఎఫ్‌ఎస్ పాండు, ఎస్‌బీ జనార్దన్ రెడ్డి, ఏబీ జనార్దన్ రెడ్డి, వ్యాపారులు, రైతులు తదితరులు పాల్గొని స్వర్గీయ ఇంద్రారెడ్డికి ఘన నివాళులు అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!