ఓర్వలేని వారు టార్గెట్ చేస్తూ ఎవరెన్నీ అడ్డంకులు, అవరోధాలు, విమర్శలు చేసినా ప్రజల పక్షమే ఉంటాం
మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (4 సెప్టెంబర్ 2026) :
ప్రజల కోసమే పట్లోళ్ల కుటుంబం అని, చేవెళ్ల ప్రాంత ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజల కోసం ఆయన వేసిన అడుగులు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే అన్నారు. తన భర్త స్వర్గీయ ఇంద్రారెడ్డి ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన ప్రజాసేవా మార్గంలో ముందుకు సాగుతున్న సబితా ఇంద్రారెడ్డి , ప్రతి ఏడాది ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్నారు. ఇందులో భాగంగానే స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ. సబితా ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చేవెళ్ల, కౌకుంట్లలోని స్వర్గీయ ఇంద్రారెడ్డి సమాధి వద్ద, ఇతర చోట్ల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంద్రన్న అమర్ రహే.. అంటూ నినాదాలతో ఆయా ప్రాంతాలను మారుమోగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సేవే పరమావధిగా భావించి, ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమన్నారు. కాలం మారినా.. ఆయన జ్ఞాపకాలు చెరిగిపోవు అని తెలిపారు. ఓర్వలేని వారు టార్గెట్ చేస్తూ ఎవరెన్నీ అడ్డంకులు, అవరోధాలు, విమర్శలు చేసినా ప్రజల పక్షమే ఉంటాం.. ప్రజల కోసమే పట్లోళ్ల కుటుంబం అని, చేవెళ్ల ప్రాంత ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులకంటే ప్రజలే ముఖ్యమంటూ నిరంతరం ప్రజల బాగు కోసమే పరితపించారని కొనియాడారు. పట్లోళ్ల కుటుంబ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఇప్పటికీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంటారని ఎవరెన్నీ అడ్డంకులు, అవరోధా లు, విమర్శలు చేసినా ప్రజల పక్షమే ఉంటామని స్ప ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలో నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు, ఇంద్రారెడ్డి అభిమానులు భారీగా పాల్గొన్నారు.

