ePaper
Saturday, October 17, 2026
📄 ePaper
Homeతెలంగాణఫ్యూచర్ సిటీలో ఉద్యమకారులకు 1,000 ఎకరాలు కేటాయించాలి

ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారులకు 1,000 ఎకరాలు కేటాయించాలి

📰 Generate e-Paper Clip

ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు, నెలవారీ పెన్షన్లు కల్పించాలి

ఈ నెల 25న ఎల్బీనగర్‌లో ‘అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనం

మన తొలి వెలుగు | తెలంగాణ బ్యూరో:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు సముచిత గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, వీ3 న్యూస్ ఛానల్, ప్రజా విశ్వంభర దినపత్రిక చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కోసం 1,000 ఎకరాల భూమిని కేటాయించి, ప్రత్యేకంగా ఉద్యమకారుల కాలనీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న ఎల్బీనగర్‌ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్‌లో ‘అలయ్ బలయ్ – తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు కాచం సత్యనారాయణ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు ఒక్కొక్కరికి 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారికి నెలవారీ పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలను ప్రభుత్వం గుర్తించి, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

దసరా పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఉద్యమకారుల మధ్య ఆత్మీయతను పెంపొందించడంతో పాటు, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ నెల 25న ఎల్బీనగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఉద్యమకారులు, తెలంగాణ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాచం సత్యనారాయణ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!