ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట దోపిడీ 

ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట దోపిడీ 

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల 

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం భువనగిరి పట్టణం హుస్నాబాద్ లో పీఎసీఎస్ వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు పడ్డారా? ఒక రెండు రోజులు ఆలస్యమైనా సరే, ఆయనే స్వయంగా దగ్గరుండి పరిస్థితులను పరిశీలించి, రైతులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునేవారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు అసలు అవగాహనే లేక నెల రోజుల నుంచి ఇక్కడ ధాన్యం కుప్పలు పేరుకుపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు ధాన్యం కుప్పలన్నింటినీ పూర్తిగా ఎత్తేయాలని లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడించి రోడ్డు దిగ్బంధం చేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్ట్ మాదారం రాంకుమార్, దండాబోయిన బాలరాజు యాదవ్, వల్లపు విజయ్, పల్లెపాటి రవికుమార్, దోసపాటి హరీష్, మోతె మనోహర్, మనోజ్, గణేష్, పాదరాజు చిన్న పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!