ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఎల్బీనగర్పార్క్ స్థలం కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి 

పార్క్ స్థలం కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి 

📰 Generate e-Paper Clip

అక్రమంగా పార్క్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్న వ్యక్తులపై న్యాయపరమైన, చట్టం పరమైన కేసులు పెట్టాలి 

 

తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి 

 

మన తొలి వెలుగు, ఎల్బీనగర్ ప్రతినిధి :

 

 

ఉమ్మడి బీ.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మారుతీ నగర్ కాలనీలో కబ్జాకు గురైన పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్న వ్యక్తుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని, కబ్జాకు గురైన పార్క్ స్థలాన్ని సంరక్షించాలని బీ.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రబారి ఆలె భాస్కర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ సామ రంగారెడ్డి లతో కలిసి బీ.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న స్థలానికి చేరుకొని, కాలనీ వాసులతో కలిసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్మాణం చేపట్టిన వ్యక్తుల పైన ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు రవీందర్ గౌడ్, యశపాల్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్, విజయ్ కుమార్, వీరాస్వామి గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రేమ్ నాథ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేష్ గౌడ్, నాయకులు రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, రామేశ్వర్, శ్రీనివాస్ శర్మ, సంగమేశ్వర్ రావు, మహేందర్ రెడ్డి, శ్రీనివాసరావు, సిద్ధేశ్వర్, అనిల్, సునీల్ రెడ్డి, రఘువీర్, రాజు, నరసింహ, మురళి, విజయ్ కుమార్, కిషోర్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్, రాకేష్, సాయిరాం, మరియు కాలనీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, వెంకట్ రెడ్డి, కాలనీ సభ్యులు అరుణ, దుర్గ, స్వాతి, సత్య, ఉమా, శారద, బిందు, సత్యవేణి, మాధవి, భార్గవి, యాదమ్మ, సుచిత్ర, సరిత, ప్రసన్న, అశ్విని, సునీత, శ్రీ మాల, మహేశ్వరి, రమ్య, నాగలక్ష్మి, శారద మరియు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!