ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిపేద విద్యార్థులకు కడుపునిండా టిఫిన్, మధ్యాహ్న భోజనం పెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం - కే ఎల్...

పేద విద్యార్థులకు కడుపునిండా టిఫిన్, మధ్యాహ్న భోజనం పెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం – కే ఎల్ ఆర్

📰 Generate e-Paper Clip

వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు అల్ఫాహారం

 

ఫ్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అమలు 

 

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

 

వచ్చే విద్యాసంవత్సవరం (2026- 27) ఫ్రీ మైమరీ నుంచి ఇంటర్మీయట్ విద్యార్థుల వరకు ఉదయం అల్ఫాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని వేలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు కడుపునిండా ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్న భోజనం అందుతుందని కిచ్ఛన్న గారి లక్ష్మారెడ్డి తెలిపారు.

కందుకూరు మండలం 54, మహేశ్వరం మండలం 54, బాలాపూర్ మండలంలో 38 పాఠశాలతో పాటు 3 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. ఆర్కేపురం, సరూర్ నగర్ డివిజన్లల్లో ఉన్న బడుల్లో చదివే పేద విద్యార్థులకు మంచి పౌష్ఠికాహారం అందనుందని మాజీ లెక్చరర్ కేఎల్ఆర్ హర్షం వ్యక్తం చేశారు.

పాలు, రాగి జావా, ఉప్మా, వెజ్ బిర్యానీ, కిచ్చిడీ, పులిహోరా, పూరీలు రోజూ ఒక ఐటెంను వడ్డించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కిచ్చెన్న తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేల పాఠశాలల్లో దాదాపు 18 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.400 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖర్చు చేయనున్నట్లు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకానికి రూ.360 ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు. కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు లీడ్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తుందన్నారు. ప్రభుత్వానికి సైతం విద్యార్థుల ఇబ్బందులను నివేదిక రూపంలో అందజేస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!