జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
మన తొలివెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
వివిధ సమస్యల పై ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 85 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 45, జిల్లా గ్రామీణాభివృది 12, సర్వే ల్యాండ్ 17, హౌసింగ్ 3, మున్సిపాలిటీ 4, జిల్లా గ్రామీణాభివృది, పంచాయతీ, ఎస్సీ కార్పొరేషన్, విద్యా, శాఖలకు ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

