ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeచాంద్రాయణ గుట్టమన తొలివెలుగు పత్రిక కథనంతో కదిలిన అధికార యంత్రాంగం

మన తొలివెలుగు పత్రిక కథనంతో కదిలిన అధికార యంత్రాంగం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు ఎఫెక్ట్

 

పత్రిక కథనంతో కదిలిన అధికార యంత్రాంగం

 

మన తొలివెలుగు పత్రిక కథనంతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు

 

పూర్తిస్థాయిలో రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్

 

మన తొలివెలుగు  కథనంతో స్థానికుల హర్షం

 

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్

పాతబస్తీ ఛత్రినక చౌరస్తా నుండి ఉప్పుగూడ వెళ్ళే రహదారిలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనుల వల్ల ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై మన తొలివెలుగు పత్రికలో కథనం ప్రచురించింది. ప్రధాన రహదారిపై నెలల తరబడి రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయని గుంతలు, రాళ్లు, మట్టి, దుమ్ము, ధూలీ, పేరుకుపోయిన బురద వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమస్యను అధికారుల ముందు ఉంచింది.

దీంతో అధికారులు వెంటనే స్పందించారు. రోడ్డుపై పేరుకున్న మట్టికుప్పలు, రాళ్ళని, తొలగించి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్స్ కి ఆదేశాలు జారీ చేశారు. అయితే పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టడంతో వాహనదారులకు కొంత మేరకు ఇబ్బందులు తగ్గినా.. వెంటనే భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసి రోడ్డును పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!