ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్సీఎస్ఆర్ నిధులకై ఎంపీ డాక్టర్ మల్లు రవి లేఖ 

సీఎస్ఆర్ నిధులకై ఎంపీ డాక్టర్ మల్లు రవి లేఖ 

📰 Generate e-Paper Clip

స్పందించిన ఎంపీ డాక్టర్ మల్లు రవికి బద్దం సతీష్ గౌడ్ కృతజ్ఞతలు

మన తొలివెలుగు, గోషామహల్ ప్రతినిధి సంకర్షణ :

హైదరాబాద్ జిల్లా గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్ ఇసామియా బజార్‌లో నిరుపేద యువతకు ఉచితంగా కంప్యూటర్ విద్యతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణలను అందిస్తున్న సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్ ) నిధుల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా స్పందించిన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవికి బద్దం సతీష్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఇసామియా బజార్ వెల్ఫేర్ కమిటీ మరియు శ్రీ శ్రీ తపోవన్ ప్రభు ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కేంద్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉచితంగా కంప్యూటర్ విద్య, డిజిటల్ నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలకు దోహదపడే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అందిస్తున్నారు. అయితే, శిక్షణా కేంద్రం విస్తరణకు అవసరమైన మౌలిక వసతులు, కంప్యూటర్లు, ఫర్నిచర్ మరియు ఇతర సదుపాయాల కోసం సీఎస్ఆర్ నిధులు అవసరమని ఎంపీ డాక్టర్ మల్లు రవిని కోరగా, ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బీ.ఐ) అధికారులకు తగిన సహాయం అందించాలని సిఫార్సు లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ మరియు ఇసామియా బజార్ వెల్ఫేర్ కమిటీ ప్రధాన కార్యదర్శి బద్దం సతీష్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలోని పేద కుటుంబాల యువతకు నాణ్యమైన ఉచిత శిక్షణ అందించేందుకు సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి వెంటనే స్పందించిన ఎంపీ డాక్టర్ మల్లు రవికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

అలాగే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ శిక్షణా కేంద్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే మరింత మంది పేద విద్యార్థులు, నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇసామియా బజార్ వెల్ఫేర్ కమిటీ కార్యవర్గ సభ్యులు, శ్రీ శ్రీ తపోవన్ ప్రభు ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు మరియు శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొని ఎంపీ డాక్టర్ మల్లు రవి చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!