ePaper
Tuesday, October 20, 2026
📄 ePaper
Homeమహేశ్వరంస్వర్గీయ ఇంద్రారెడ్డికి ఘన నివాళి

స్వర్గీయ ఇంద్రారెడ్డికి ఘన నివాళి

📰 Generate e-Paper Clip

ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రజా హృదయ విజేత స్వర్గీయ ఇంద్రారెడ్డి

మన తొలివెలుగు | మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (04 అక్టోబర్ 2026) :

తెలంగాణ గడ్డపై ప్రజా సేవను జీవిత ధ్యేయంగా చేసుకుని, పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడిన ప్రజానాయకుడు స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి అని బడంగ్ పేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అన్నారు. స్వర్గీయ స్వర్గీయ ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామిడి రాంరెడ్డి మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లక్షణాలు ఆయనను ప్రత్యేకమైన ప్రజానాయకుడిగా నిలబెట్టాయన్నారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లేందుకు జై తెలంగాణ పార్టీని స్థాపించి, తెలంగాణ కోసం తన రాజకీయ పోరాటాన్ని కొనసాగించారన్నారు. ఇంద్రారెడ్డి రాజకీయ జీవితం కేవలం పదవుల కోసం కాకుండా ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం సాగిన పోరాటానికి ప్రతీక అన్నారు. ఆయన అకాల మరణం చేవెళ్ల ప్రాంతానికే కాకుండా తెలంగాణ రాజకీయాలకు తీరని లోటుగా మిగిలిందన్నారు. స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకుడు, తెలంగాణ కోసం తపించిన ధీశాలి, ప్రజా సమస్యల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు అని తెలిపారు. నాయకులు మరణిస్తారు.. కానీ ప్రజల కోసం వారు చేసిన సేవలు, చూపిన మార్గం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, నాయకులు భీమిడి జంగారెడ్డి, నరేందర్ రెడ్డి, దర్శన్ రెడ్డి, పట్లోళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!