మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
తెలంగాణ గుండెచప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని, మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం వైపు వేగంగా దూసుకెళ్లిందని, జల్ పల్లి సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్దన్ అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ కార్యక్రమంలో భాగంగా జనార్ధన్ ఆధ్వర్యంలో జల్పల్లి లో గులాబీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ.. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండ బీఆర్ఎస్ గులాబీ జెండా అన్నారు. 25 వసంతాల మైలురాయిని అధిగమించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు.
మహోజ్వల లాంగ్ మార్చ్
బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు …ఒక విప్లవం అని జనార్దన్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల వారికున్న అంకితభావంతో వారి భావోద్వేగ ప్రసంగాన్ని వినిపించారు. తెలంగాణ వెనుకపాటు తనాన్ని గురైందని చెప్పి నీళ్లు నిధులు నియామకాల్లో చాలా అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతులు సమకూర్తాయని ఉద్దేశంతో ఆరు దశాబ్దాల అన్యాయం, అణచివేయబడిన ఆకాంక్షల మధ్య 2001లో జలదృశ్యంలో పురుడుపోసుకున్న గులాబీ జెండా.. పాతికేండ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిందన్నారు. పోరాటంలో నైనా, పాలనలోనైనా తన పటిమను చూపించి. అగాధాలు, అడ్డంకులు ఎన్ని ఎదురైనా.. ఆ పతాకం తలవంచలేదన్నారు. ఎత్తిన పిడికిలి సడలనివ్వలేదన్నారు. అందుకే గులాబీ జెండా ప్రజలకు ఓ గుండెధైర్యం తెలంగాణకు ఓ భరోసా అని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జనార్ధన్ తో పాటు పలువురు బీ ఆర్ ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెద్దలు సూరెడ్డి కృష్ణారెడ్డి, పోలేమోని నాగేష్ ముదిరాజ్ , షేక్ అఫ్జల్ , కొంగరి సుభాష్ , నవపేట్ ఆంజనేయులు , గుండు నర్సింగ్ , మతిన్ పటేల్ , సూరెడ్డి గోపాల్ రెడ్డి , సూరెడ్డి సత్తి రెడ్డి, శేఖర్ గౌడ్, శ్రీధర్ గౌడ్ , సూరెడ్డి వినయ్ రెడ్డి , యంజాల రవి , రాజు సోషల్ మీడియా ఇన్ఛార్జీలు వాసుబాబు, సయ్యద్ అబ్బాస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
