మన తొలివెలుగు, మహేశ్వరం, ప్రతినిధి ముత్తయ్య
ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ వేడుకల్లో భాగంగా అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో పాత మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిహెచ్ఎంసి 58, 59, 60 డివిజన్ లో మీర్పేట్ చౌరస్తా లలితా నగర్ చౌరస్తా, స్వాగత్ గ్రాండ్, గాయత్రి నగర్ మెయిన్ రోడ్డు, ఆటో స్టాండ్, క్యాంప్ ఆఫీస్ సమీపంలోని దీన్ దయాళ్ నగర్ తదితర ప్రాంతాల్లో అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అర్కల కామేష్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు కోట్ల గొంతుకలను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక,
సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కలను మాజీ సీఎం కేసీఆర్ సాకారం చేశారన్నారు. అగాధాలు అడ్డంకులు ఎన్ని ఎదురైనా టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా తలవంచలేదన్నారు. అందుకే గులాబీ జెండా ప్రజలకు గుండె ధైర్యం తెలంగాణకు భరోసా అని తెలిపారు. రెండున్నర సంవత్సరంలో రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. రేవంత్ రెడ్డి పోవాలి మళ్ళీ కేసీఆర్ రావాలి అని నినాదాలు ప్రజల నుండి లక్షల గొంతుల నుండి వినిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అర్కల భూపాల్ రెడ్డి, తీగల విక్రమ్ రెడ్డి ,దీప్లాల్ చౌహాన్, బొక్క రాజేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నవీన్ గౌడ్, సిద్దాల బీరప్ప, సిద్దాల చిన్న బీరప్ప, సిద్ధాల అంజయ్య, బాలరాజ్, చరణ్ , బస్వప్ప, అవినాష్, సిద్దాల భరత్ , పంతంగి మాధవి, సునీత బాలరాజ్, లతా శేఖర్, వెంకటేష్, రామకృష్ణ , నరసింహ, శ్రీకాంత్ ముదిరాజ్, బలరాం, రజాక్, అర్జున్, యాదగిరి, సాయి తదితరులు పాల్గొన్నారు
