ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిబండ రావిరాల గ్రామ ప్రజల పోరాటానికి అండగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 

బండ రావిరాల గ్రామ ప్రజల పోరాటానికి అండగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, ఇబ్రహీంపట్నం ప్రతినిధి సీహెచ్ రాజు :

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండ రావిరాల గ్రామంలోని సర్వే నంబర్ 268లో ఉన్న 494 ఎకరాల భూమిని, స్థానిక గ్రామస్థుల అభిప్రాయాన్ని పూర్తిగా పక్కనపెట్టి, జీవో నెం.20 పేరుతో డంపింగ్ యార్డు కోసం కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ, బండ రావిరాల గ్రామస్తులు చేపట్టిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాన్ని కాలరాస్తూ, గ్రామాల భవిష్యత్తుతో చెలగాటమాడే కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక విధానాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే… బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన 14 గ్రామాల సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!