ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

అదనపు జిల్లా కలెక్టర్ భాస్కర్ రావు

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ :

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి , వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 57అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

అందులో రెవిన్యూ శాఖ 39,జిల్లా పంచాయతీ 5, చేనేత మరియు జౌళి 4, మున్సిపాలిటీ 2 , శిశు సంక్షేమ 2, జిల్లా వ్యవసాయ 2, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హౌసింగ్, సర్వే ల్యాండ్ శాఖలకు ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ.ఓ శోభారాణి , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!