మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి, ముత్తయ్య
వేసవి హకాలం పూర్తయ్యే వరకు శంషాబాద్ జోన్‌లో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతర సరఫరా కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ కే. చంద్రకళ నీటి సరఫరా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జోనల్ కమిషనర్ కే. చంద్రకళ ఆధ్వర్యంలో హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో శంషాబాద్ జోన్‌కు సంబంధించిన నీటి సరఫరా కార్యాచరణ ప్రణాళిక పై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులు, సరఫరాలో ఉన్న సమస్యలు, భవిష్యత్ అవసరాలు సమయానికి నీటి పంపిణీపై అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. జోనల్ కమిషనర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, శంషాబాద్ జోన్‌లో ఎటువంటి నీటి సరఫరా అంతరాయం లేకుండా నిరంతర సరఫరా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, ప్రజలకు నాణ్యమైన నీటి సరఫరా అందించేందుకు కట్టుబడి పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ సూపరింటెండింగ్ ఇంజనీర్, హెచ్ఎండబ్ల్యూఎస్ చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్లు పాల్గొన్నారు.
