మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
వృద్ధాప్య పెన్షన్ల కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత గుర్తింపు ప్రక్రియ వల్ల లబ్ధిదారులు, ముఖ్యంగా వృద్దులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పెన్షన్ల దారుల ముఖ ఆధారిత గుర్తింపు రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు.
బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, బస్వాపురం గ్రామాలలో పెన్షన్ల దారుల సమస్యలను తెలుసుకున్న అనంతరం నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వేలిముద్రలు సరిపోలని వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ పోందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేపంతో ముఖ ఆధారిత గుర్తింపు పెట్టడం వల్ల ఫేస్ రికగ్నిషన్ సరిగ్గా పనిచేయక పోవడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏక్కడో పెన్షన్ల పంపిణీలో జరిగిన అవినీతి సాకుగా చూపించి మోత్తం పెన్షన్ దారులను ఇబ్బందులు పెట్టడం కరక్టు కాదని, పెన్షన్ల కోసం ఎర్రటి ఎండలో వృద్ధులు అవస్థలు పడుతున్నారని, ఫోన్లో ముఖం ఆధారితం రాకపోవడం వల్ల పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ముఖ ఆధారిత గుర్తింపు తీసివేసి పెన్షన్ల దారులకు పాత పద్ధతిలో పెన్షన్లు ఇవ్వాలని కోరారు.

