మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
పోలీస్ స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లతో రిసెప్షన్ అధికారి, సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా.. మాట్లాడినప్పుడే ఫిర్యాదుదారులు సంతృప్తి చెందడంతో పాటు పోలీస్ శాఖపై గౌరవ భావం పెరుగుతుందని భువనగిరి డివిజన్ డీఎస్పీ బీ.రవీందర్ పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. గురువారం భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, రికార్డుల నిర్వహణ విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లతో రిసెప్షన్ అధికారి మరియు సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడినప్పుడే ఫిర్యాదుదారులు సంతృప్తి చెందడంతో పాటు పోలీస్ శాఖపై గౌరవ భావం పెరుగుతుందని సూచించారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లోని అన్ని రికార్డులు, ఫైల్స్‌ను “5S విధానం” ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని, స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, శుభ్రమైన వాతావరణంలో ఉంచాలని సూచించారు. రికార్డులు, ఫైల్స్ నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రూరల్ ఎస్. హెచ్. ఓ ఎం. అనిల్ కుమార్, ఎస్ ఐ పీ.కే . శివ శంకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

