ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాక్రీడలు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి

క్రీడలు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే కుంభం         

మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళాశాల మైదానంలో హోటల్ చాలుక్య గ్రాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొదటి బుహుమతి 25,000/-, 2 వ బహుమతి 15,000/- అందజేస్తూ.. ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న శ్రీనివాస్ శెట్టి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, పట్టణ కౌన్సిలర్లు, ఆర్గనైజషన్ కమిటీ సభ్యులు సురేష్, రాజు, కిరణ్, నిరాజ్, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పలువురు క్రీడాభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!