ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు రోజురోజుకు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని, ఎలాంటి అనుమతులు లేకుండా విద్యను వ్యాపారంగా స్కూల్లలో డొనేషన్లు బుక్స్ యూనిఫాం అమ్ముతూ తల్లిదండ్రుల నుంచి వేళల్లో ఫీజులు తీసుకుంటున్నారని అన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యాసంస్థల్లో ఉచితంగా విద్య అందించాలని చెప్తున్నా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యను వ్యాపారంగా చేస్తూ లక్షలలో ఫీజులు తీసుకుంటున్నారని అన్నారు. తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ పశ్చిమబెంగాల్, పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయని తెలంగాణలో కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకు రాలేదని అన్నారు. జిల్లాలో ఎలాంటి అనుమతి లేకుండా అడ్మిషన్ చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, లావుడియా రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్, హిందూ రాణి, ధరావత్ జగన్ నాయక్, పుట్టల ఉదయ్ జిల్లా కమిటీ సభ్యులు ప్రసన్న ,అక్షిత పాల్గొన్నారు.

