ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లారైతు గోసా - బీజేపీ భరోసా యాత్రను విజయవంతం చేయాలి 

రైతు గోసా – బీజేపీ భరోసా యాత్రను విజయవంతం చేయాలి 

📰 Generate e-Paper Clip

బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ 

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద సోమవారం నుంచి చేపట్టబోయే ‘రైతు గోసా – బీజేపీ భరోసా’ యాత్ర విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా మీదగా వివిధ మండలాలను సందర్శిస్తూ నేరుగా రైతులతో మాట్లాడితే.. ధాన్యం ఎంత కొనుగోలు చేస్తున్నారు తెలుస్తోందని, రెండు రోజుల పాటు రైతులతోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద తాము మాట్లాడిస్తామన్నారు. అన్నదాతలకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట కార్యవర్గ సభ్యులు మాయ దశరథ , మాజీ రాష్ట కార్యవర్గ సభ్యులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, భువనగిరి పట్టన అధ్యక్షుడు రత్నపురం బలరాం, పాదరాజు ఉమా శంకర్, బబ్బూరి సురేష్, మండల అధ్యక్షుడు చిరిక సురేష్ రెడ్డి లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!