ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణత్యాగానికి ప్రతి రూపం బక్రీద్ పండుగ

త్యాగానికి ప్రతి రూపం బక్రీద్ పండుగ

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

త్యాగానికి ప్రతి రూపంగా నిలిచే బక్రీద్ పండుగకు సందడి మొదలైంది. ఘనంగా బక్రీద్ ను నిర్వహించుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. సత్ప్రవర్తనతో మెలగాలని, ఎల్లప్పుడు త్యాగనిరతని చాటాలని ప్రత్యేక పార్ధనలు చేస్తుంటారు. బక్రీద్ పండుగకు ముస్లిం సాంప్రదాయ ప్రకారం జంతువులను బలి ఇస్తుంటారు. దీని కోసం బక్రీద్ కు పెద్ద ఎత్తున జీవాలను బలిదానం(కుర్భానీ) ఇవ్వడానికి జీవాల క్రయ విక్రయాలు బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరందుకున్నాయి. ప్రధాన రహదరాల్లో, ప్రత్యేకంగా కేటాయించిన బౌండరీలలో గొర్రెలను, మేకలు, ఎద్దులను విక్రయిస్తున్నారు. ఈ నెల 28న పండుగను పరిస్కరించుకొని పహాడీషరీఫ్, బాలాపూర్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ రెడ్డి , సుధాకర్ బందోబస్తు నిర్వహించడానికి రెండు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమారు 200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు, అధికారులు ఈద్గాలలో పర్యటించి ఈద్గాలను సిద్ధం చేసేలా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి. శానిటేషన్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కుర్బానీ సమర్పించే సమయంలో జంతువుల వ్యర్థాలను కవర్లలో వేసి మున్సిపాలిటీ సంబంధించిన వాహనాలలో అందించాలి. లేదా వారు కేటాయించిన స్థలంలో వేయాలి. ప్రజలు పరిశుభ్రతను పాటించాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు.

బక్రీద్ పండుగ నేపథ్యం

అల్లా ప్రజల శ్రేయస్సు కొరకు, సన్మార్గంలో నడిపించడానికి ఎంతో మంది ప్రవక్తలను భూమి మీదకు పంపిస్తాడు. అందులో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగాన్ని పరిశీలించాలనుకొని పుత్రుడు ఇస్మాయిల్ ను తనకు బలి ఇవ్వాలని అలా ఇబ్రహీం కలలో కనిపించి ఇబ్రహీంను కోరుతాడు. దీంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్దమవుతాడు. కత్తి కుమారుడి గొంతుపై పడగానే అతని త్యాగనిరతికి మెచ్చి కుమారుడు స్థానంలో గొర్రె పొట్టెలును ఉంచుతాడు. దానిని బలి ఇస్తాడు. అప్పటి నుండి బలిదానం (ఖుర్భానీ ఇచ్చే ప్రక్రియ) కొనసాగుతుందని ముస్లిం మత పెద్దలు తెలుపుతున్నారు.

గత 5 సంవత్సరాలుగా గొర్రెలను విక్రయిస్తున్నాను హుస్సేన్, సంతోష్ నగర్

బక్రీద్ పండుగ సమయాలలో గత 5 సంవత్సరాలుగా గొర్రెలను విక్రయిస్తున్నాము. మా వద్ద విలైటీ బ్రీడ్ గొర్రె రూ. 80వేలు, హంటల్ రూ.40వేలు, తెలంగాణ పొట్టేలు జత 25 వేలు ధర పలుకుతుంది. చాలా మంది వినియోగదారులు వచ్చి బేరం చేస్తున్నారు. వెళ్తున్నారు. అక్కడక్కడ అడిగి వచ్చి మళ్లీ మా దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. విలైటీ బ్రీడ్ గొర్రెలు దాదాపు ఎక్కడ కనిపించవు మా దగ్గరే ఉంటుంది. జల్ పల్లి, శ్రీరామ కాలనీ చౌరస్తా కలిసే చోట మేము విక్రయిస్తున్నాము.

బందోబస్తు ఏర్పాటు చేసాము

పహాడీషరీఫ్, బాలాపూర్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ రెడ్డి, సుధాకర్ 

ప్రధాన ఈద్గాలైన పహడీ షరీఫ్, బార్కస్, జల్ పల్లి, షాహీన్ నగర్, రోషన్ దౌలా, కొత్తపేట తదతర ప్రాంతాలలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు ముగించుకోవాలి. పండుగ సమయాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడ్డా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ముస్లిం సోదరులు ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలి.

కుర్భానీని సొంత డబ్బుతో ఇవ్వాలి 

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ షేక్ అప్జల్ 

కుర్భానీని ఇచ్చేవారు తమ సొంత డబ్బుతో మాత్రమే ఇవ్వాలి. అప్పుడే నిజమైన ముక్తి లభిస్తుంది. జంతుబలి (కుర్భానీ) ఇచ్చిన అనంతరం ఆ మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం తమ కుటుంబం కోసం ఒక బాగం ఇంటి పరిసరాల ప్రజలకు, బంధువులకు ఇవ్వాలి. ఒక భాగం నిరుపేదల కోసం ఇవ్వాలి. ప్రజలందరు త్యాగనిరతని చాటాలని, సత్ప్రవర్తనతో మెలగాలని ప్రార్ధనలు చేస్తాము.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!