ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాదివ్యాంగుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  

దివ్యాంగుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  

📰 Generate e-Paper Clip

దివ్యాంగుల చట్టాలపై రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలి 

ఎన్.పీ.ఆర్.డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునేల్లి వెంకట్

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

దివ్యాంగుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరస్తున్నాయని ఎన్.పీ.ఆర్.డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునేల్లి వెంకట్ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులు అమలు కావడం లేదని అన్నారు. 2016 దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పంద పత్రం, నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపుకోసం దివ్యాంగులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మించాలని, దివ్యాంగులపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళా దివ్యాంగులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. స్థానిక సంస్థలలో దివ్యాంగులకు నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని అన్నారు. మే 29-31 తేదీల్లో భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో దివ్యాంగుల చట్టలపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సురూపంగ ప్రకాష్, కార్యదర్శి వనం ఉపేందర్, కోశాధికారి లలిత, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, పాoడాల శ్రీహరి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!