ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిమంద కృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఆరోగ్య శ్రీ పథకం

మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఆరోగ్య శ్రీ పథకం

📰 Generate e-Paper Clip

కొత్తపేటలో ఘనంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం  

కొమ్ము రాజశేఖర్ మాదిగ 

మన తొలివెలుగు రంగారెడ్డి జిల్లా బ్యూరో (07ఆగస్ట్ 2026) :

మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఆరోగ్య శ్రీ పథకం ఆచరణలోకి వచ్చింది అని ఎల్బీనగర్ ఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ము రాజశేఖర్ మాదిగ అన్నారు. కొత్తపేటలో కొమ్ము రాజశేఖర్ మాదిగ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్ము రాజశేఖర్ మాదిగ మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ పోరాటం ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. 2004 ఆగస్ట్ 7న గుండె జబ్బుల చిన్నారుల సదస్సు జరిగిందని, ఆ సదస్సులో ఒక బాలుడు మృతి చెందగా మృతదేహంతో ట్యాంక్ బండ్ పై మందకృష్ణ మాదిగ ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించి ఆరోగ్యశ్రీ రూప కల్పన చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీసాల నాగరాజు, డప్పు కళాకారుల సంఘం మహంకాళి శ్రవణ్, సురారపు హుస్సేన్, పాల్వాయి రమేష్, ఇరుగు చంటి, ఇరుగు నాగరాజు, శ్రీను, సతిష్, రవి, వెంకటేష్, వెంకన్న, యల్లయ్య, బాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!