సూరారం డివిజన్ మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ
గాజుల రామారం లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు
మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ రిపోర్టర్ టీ. రమేష్ (07 ఆగస్ట్2026) :
చేనేత రంగాన్ని ప్రభుత్వం కాపాడాలని, నేతన్నలకు తగిన న్యాయం చేయాలని సూరారం డివిజన్ మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ కోరారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఉమ్మడి గాజుల రామారం డివిజన్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు సాయినాథ్ నేత ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం ముఖ్య సలహాదారులు జీహెచ్ఎంసీ సూరారం డివిజన్ మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత వ్యవస్థను ప్రభుత్వం కాపాడాలని, వారికి తగిన న్యాయం చేకూరాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని, చేనేత గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గాజులరామారం పద్మశాలి సేవా సంఘం కార్యనిర్వహక అధ్యక్షులు డాక్టర్ రాంచందర్, ప్రధాన కార్యదర్శులు సారంగి అశోక్, ఉపాధ్యక్షులు బద్రి, ఆవిడపు సతీష్, కార్యదర్శులు మోకులా శంకర్, గోంటెల శ్రీనివాస్, ఆంజనేయులు, దామోదర్, ఈశ్వర్, ప్రసాద్, సాయి, కిరణ్, దేవరపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

