ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్కార్మికుల‌ను వెంట‌నే ప‌ర్మినెంట్ చేయాలి

కార్మికుల‌ను వెంట‌నే ప‌ర్మినెంట్ చేయాలి

📰 Generate e-Paper Clip

ఎంటీఏ ఆర్ఈఓయు టెక్నాలజీస్ యాజమాన్య నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఐటీయూ ర్యాలీ 

కంపెనీలో పని చేస్తున్న 350 మంది ఫిక్స్ టర్మ్ కార్మికులను పర్మినెంట్ చేసే వరకు పోరాటం ఆగ‌దు

సీఐటీయూ మ‌ల్కాజ్‌గిరి స‌హాయ కార్య‌ద‌ర్శి ఐల‌పురం రాజ‌శేఖ‌ర్‌

మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ రిపోర్ట‌ర్ టీ. రమేష్ (07 ఆగ‌స్ట్ 2026) :

గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఎంటీఏఆర్ఈఓయు టెక్నాలజీస్ యాజమాన్య నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ అక్రమంగా తొలగించిన ఫిక్స్ ట‌ర్మ్‌ కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని సీఐటీయూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షాపూర్ న‌గ‌ర్‌ లో ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పరిశ్రమలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫిక్స్ టర్మ్ కార్మికులతో యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుంద‌న్నారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని ఆందోళన చేస్తున్న కార్మికులను విధుల నుండి తొలగింపుకు నిరసనగా షాపూర్ నగర్ రైతు బజార్ నుండి ఉషోదయ టవర్స్ వరకు ఫిక్స్ టర్మ్ కార్మికులకు మద్దతుగా సీఐటీయూ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సీఐటీయూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సహాయ కార్యదర్శి ఐలపురం రాజశేఖర్, మండల కన్వీనర్ కీలుకానీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఉన్న ఎంటీఎఆర్ ఈఓయు పరిశ్రమలో గత పది.. పదిహేను సంవత్సరాల నుండి 350 మంది ఐటిఐ డిప్లమా చదివి ఫిక్స్ టర్మ్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నార‌న్నారు. వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేక శాశ్వత ఉద్యోగ హోదా ఇవ్వకుండా ఒప్పందాలను పునరుద్ధరిస్తూ ఉద్యోగ భద్రతను దూరం చేస్తున్నారని, యాజ‌మాన్యం కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా వ్యవహరిస్తుందని మండిప‌డ్డారు. కంపెనీలో పని చేస్తున్న 350 మంది ఫిక్స్ టర్మ్ కార్మికులను వెంట‌నే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులను అకారణంగా విధుల నుండి తొలగిస్తూ సెటిల్మెంట్ చేస్తూ నోటీసులు జారీ చేయడం కార్మిక హక్కులు కాలరాయడమేనని, కార్మికులను బానిసలుగా మార్చే కుట్రలో భాగమని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తొలగించిన కార్మికులను వెంటనే విధులలోకి తీసుకొని పర్మినెంట్ కార్మికులుగా గుర్తించాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణతో ఎంటీఏఆర్ యాజమాన్యంతో కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని హ‌చ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బొడిగె లింగస్వామి, ఇ. దేవదానం, కే. శీను, పసుల అంజయ్య, తిమ్మప్ప, కరుణాకర్, భాష, యాదవ రెడ్డి, ఆంజనేయులు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!