ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్సూరారం సీఐగా బాధ్యతలు చేపట్టిన కే. బాలరాజు కి ఘన సన్మానం

సూరారం సీఐగా బాధ్యతలు చేపట్టిన కే. బాలరాజు కి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

సూరారం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజుని గాజుల రామారం డివిషన్ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి , బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జై శంకర్ గౌడ్, మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పులి బలరాం, శ్రీరాములు, మాధవులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కే. బాలరాజు గతంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహించిన సమయంలో, ముఖ్యంగా కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షించారని కొనియాడారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, నిష్పాక్షికంగా పరిష్కరించే అధికారిగా మంచి గుర్తింపు పొందారని పేర్కొన్నారు. మళ్లీ సూరారం పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టడం స్థానిక ప్రజలకు ఆనందదాయకమని తెలిపారు. ఆయన నాయకత్వంలో సూరారం పరిధిలో శాంతి భద్రతలు మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం, మెరుగైన పోలీసు సేవలు అందుతాయనే పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కే. బాలరాజుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు ఇదే సేవాభావంతో న్యాయం చేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!