స్పెక్టరా లాబ్స్ అధినేత యువ పారిశ్రామిక వేత్త తొర్ర విష్ణు
పారిశ్రామిక వేత్తలకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
మహబూబ్ నగర్ జిల్లాలోని గురుకుంట అనే చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి ఉన్నత చదువులు చదివి అంతర్జాతీయ ఫార్మా రంగంలో ఎన్నో విజయాలు స్వంతం చేసుకున్న పాలమూరు ముద్దుబిడ్డ , ఫార్మ దిగ్గజం , ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత డాక్టర్ మన్నే సత్యనారాయణరెడ్డి ని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. నిత్యం సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించే గొప్ప మానవతావాది డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డికి యాదాద్రి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి కుత్బుల్లాపూర్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త తొర్ర విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తొర్ర విష్ణు మాట్లాడుతూ. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డి ఎంతో కష్టపడి ఎదిగిన వ్యక్తుల్లో ఒకరని, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆయన మాలాంటి ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డి ప్రత్యక్షంగా 20 వేలకు పై చిలుకు మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న గొప్ప వ్యక్తి అని గతంలో రెడ్డీస్ ల్యాబ్ లో వారితో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఛైర్మన్ గా డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డిని నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కొండా సురేఖ కి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కి, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి, భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . యాదాద్రి దేవస్థానానికి ధర్మకర్తలుగా నియామకం అయిన అందరికి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డి సారధ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదాద్రి దేవస్థానం కూడా అంతే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు .

