ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ విభాగం అబ్జర్వర్‌గా బద్దం సతీష్ గౌడ్ నియామకం

సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ విభాగం అబ్జర్వర్‌గా బద్దం సతీష్ గౌడ్ నియామకం

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారమే లక్ష్యం: బద్దం సతీష్ గౌడ్

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి కానుగుల సాయి కిషోర్ :

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఓబీసీ విభాగంలో సంస్థాగత బలోపేతానికి చేపడుతున్న చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బద్దం సతీష్ గౌడ్ ను సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ విభాగం అబ్జర్వర్‌గా నియమించారు. ఈ మేరకు తెలంగాణ పీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్, షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన బద్దం సతీష్ గౌడ్, తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలను అప్పగించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి, ఓబీసీ విభాగం చైర్మన్ వీర్లపల్లి శంకర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నియామక ప్రక్రియలో సహకరించిన టీపీసీసీ కోఆర్డినేటర్ ధనలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. సికింద్రాబాద్ జిల్లాలో ఓబీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.

ఓబీసీ వర్గాల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, పార్టీ కార్యకర్తలు మరియు నాయకత్వం మధ్య సమన్వయాన్ని పెంపొందించడం తన ప్రాధాన్య కర్తవ్యాలుగా ఉంటాయని బద్దం సతీష్ గౌడ్ తెలిపారు. ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టి, పార్టీ పట్ల విశ్వాసాన్ని మరింత పెంచేందుకు నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు.

అలాగే జిల్లా వ్యాప్తంగా ఓబీసీ నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ వేదికగా పోరాటం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజా సంక్షేమ విధానాలను ప్రతి ఇంటికీ చేర్చేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ అభివృద్ధి, సంస్థాగత బలోపేతం మరియు ఓబీసీ వర్గాల సాధికారత కోసం తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని, అధిష్ఠానం ఆశయాలకు అనుగుణంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని బద్దం సతీష్ గౌడ్ పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!