ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్గులాబీ జెండ.. తెలంగాణ ప్రజలకు కొండంత అండ

గులాబీ జెండ.. తెలంగాణ ప్రజలకు కొండంత అండ

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్

మన తొలివెలుగు : కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ లో మాజీ వార్డ్ మెంబర్, డివిజన్ ఉపాధ్యక్షులు ఎం.డీ మసూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గులాబీ జెండ.. తెలంగాణ ప్రజలకు కొండంత అండ అని, తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి చక్కటి వేదిక పార్టీ కార్యాలయాలు అని అన్నారు. అంతక ముందు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ రాంరెడ్డి, రుద్ర అశోక్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు అంజన్ గౌడ్, కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!