ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్కూన శ్రీశైలంగౌడ్ ఫామ్ హౌస్ కు కూతవేటు దూరం

కూన శ్రీశైలంగౌడ్ ఫామ్ హౌస్ కు కూతవేటు దూరం

📰 Generate e-Paper Clip

కూన శ్రీశైలంగౌడ్ ఫామ్ హౌస్ కు కూతవేటు దూరం

కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల ఆధిపత్య పోరులో అభివృద్ధికి నోచుకోని ఉషోదయ కాలనీ (హంసరాజు లేఔట్ ) పార్క్ 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం పరిధిలోగల ఉషోదయ కాలనీ గా పిలుచుకుంటూ రికార్డుల్లో హంసరాజు లేఔట్ గా పేరున్న ఉన్న ఈ కాలనీ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. కాలనీలోనే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ బందువులకు కు చెందిన ఫామ్ హౌస్ ఉన్నపటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల పదేళ్లలో అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కి చెందిన కే.పీ వివేకానంద కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాడని ప్రజల ఆరోపిస్తున్నారు.

కనీసం మెయిన్ రోడ్డు నుండి లోనికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదంటే 10 సంవత్సరాలలో కాలనీ పట్ల ఏమేర అభివృద్ధి చేశారో అర్థమవుతుంది. కాలనీ ఆనుకొని ఉన్న జీహెచ్ఎంసీకి చెందిన పార్క్ విస్తరించి ఉండగా కనీసం దానిని సైతం పట్టించుకున్న నాధుడే లేడు. నిత్యం రద్దీగా ఉండే ఈ పార్కు యువకులకు, వృద్ధులకు, పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కానీ పార్కులో చూస్తే కనీస సౌకర్యాలు కూడా లేకుండా విరిగిపోయిన బెంచీలు, పగిలిపోయిన రాళ్లు, కంకర తేలిన రోడ్లు, విరిగిన వృక్షాలు పార్కులో నిత్యం దర్శనమిస్తూ ఉంటాయి. వర్షం పడిందంటే వాకర్స్ కు మాత్రం సెలవే. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫామ్ హౌస్ కూడా ఈ కాలనీలోనే ఉండడంతో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే.పీ వివేకానంద అభివృద్ధిని పట్టించుకోలేదని స్థానిక ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇరువురి ఆదిత్య పోరులో హంసరాజు లేఔట్ అభివృద్ధికి నోచుకోవడం లేదు.

నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కనీసం ఇప్పుడైనా ఈ కాలనీ అభివృద్ధి పరిచి కాలనీలో కావాల్సిన సౌకర్యం డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. వర్షం పడిందంటే కాలనీ లోకి రావడం కష్టమవుతుంది. చిత్తరమ్మ దేవాలయంలో ఉన్న అమ్మ వారి పెద్ద విగ్రహం ఎప్పుడు ఆ కాలనీ వైపే చూసున్నా కూడా ప్రజా ప్రతినిదుల చూపు మాత్రం ఈ కాలనీ వైపు పడడం లేదు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందువల్ల మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కొలను హనుమంతరెడ్డి లాంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు చోరువతో హంసరాజు లేఔట్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. స్థానిక ప్రజల ఆశలు నెరవేరుతాయి.. అడియాశలే అవుతాయో.. వేచి చూడాలి మరి..!

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!