ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం
బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
సీఎంసీ నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ పరిధి బండారి లేఅవుట్, తుర్క చెరువు ప్రాంతాలలో బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ ప్రజా సమస్యలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు లో ప్రెజర్ తో నీటి సరఫరా, లైబ్రరీ పైకప్పు లీకేజీ, ఒంటరి మహిళలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, నూతన రేషన్ కార్డులు, పెన్షన్లు, ఎస్ఎన్డీపీ పనుల వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో వర్షం వచ్చిన ప్రతిసారి బండారి లేఔట్ లోని ప్రజలు వరద నీటి సమస్యతో భయాందోళనకు గురయ్యేవారని గత 12 ఏళ్ల కాలంలో ఎస్ఎన్డీపీ పనుల ద్వారా వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. బండారి లేఔట్ లోని లైబ్రరీ పైకప్పు లీకేజీ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి పైకప్పు లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయింపు చేయడంతో పాటు పెన్షన్లను, దారిద్యరేఖకు దిగువన ఉన్నవారికి రేషన్ కార్డులను ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో ఎస్ఎన్డీపీ పనుల ద్వారా బండారి లేఔట్ లో వరద మంపు తీవ్రతను తగ్గించామని, రానున్న రోజుల్లో కూడా ఎస్ఎన్డీపీ ఫేస్ -2 పనులను త్వరితగతిన పూర్తి చేసి వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో కలసి తుర్క చెరువును సందర్శించిన ఎమ్మెల్యే చెరువులో మురుగునీరు కలవకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మురుగునీటిని బయటకు పంపించి వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ఆట సామాగ్రి తో పాటు చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సాబేర్ అలీ, ఇరిగేషన్ డీఈ నాయక్, ఈఈ సురేష్ బాబు, వాటర్ వర్క్స్ మేనేజర్ సౌమ్య, ఏఈ రవీంద్ర నాయక్, ఇంజనీరింగ్ ఏఈ ప్రవీణ్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ జ్యోతి నరసింహారెడ్డి, చందు ముదిరాజ్, బాలాజీ నాయక్, గాజుల సుజాత, సంక్షేమ సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు నరసింహారాజు, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రవి, పద్మావతి, లక్ష్మీ కుమారి, భారతి, శ్రీదేవి, మాన్య తదితరులు పాల్గొన్నారు.

