ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంప్రధాన రహదారుల్లో గుంతలు.. బాబోయ్ గుంతలు

ప్రధాన రహదారుల్లో గుంతలు.. బాబోయ్ గుంతలు

📰 Generate e-Paper Clip

కంకర తేలిన రహదారుల్లో ప్రమాదకర ప్రయాణ ఘంటికలు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్, మీర్ పేట్, అల్మాస్ గూడ, నాదర్ గూల్, బాలాపూర్, జల్ పల్లి తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారుల్లో అక్కడక్కడ గుంతలు, కంకరతో నిండి స్థానికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధ్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు పైపులైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో చాలా చోట్ల దారులు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతులు పడినా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిరుజల్లులు కురిస్తే పలు రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. అలాంటిది భారీ వర్షం పడిందంటే ఇక సముద్రాన్ని తలపించేలా ఉంటోంది. చిన్నపాటి వర్షం పడితే ఆ గోతుల్లో నీరు చేరి చెరువులా తయారవుతుంది. దీన్ని గుర్తించని డ్రైవర్లు చిన్నచిన్న ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్డులో ప్రయాణించడం సాహసమేనని అంటున్నారు. కాగా పలు ప్రాంతాలలో రోడ్లు మరింత నరకంగా మారుతున్నాయి. రోడ్లపై గుంతలు తవ్వడంతో వాహనదారులు, పాదాచారులకు తిప్పలు తప్పడం లేదు. లెక్కలేనన్ని గోతులపై గతిలేక ప్రయాణం సాగిస్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గోతులు పూడ్చేందుకు వచ్చిన జీహెచ్ ఎంసీ సిబ్బంది.. దెబ్బతిన్న రోడ్లపై ప్యాచ్‌ వర్కుతోనే సరిపెడుతున్నారు. దీంతో భారీ వర్షం పడగానే రోడ్లన్నీ గుంతలుగా మారుతున్నాయి. అల్మాస్ గూడ, మీర్ పేట, బాలాపూర్, జల్ పల్లి తదితర ప్రాంతాలలో రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశం వుందని, ప్రాణనష్టం జరుగకముందే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రోడ్లు మరింత అద్వానంగా తయారయ్యాయని తెలిపారు. దీనికి తోడు రోడ్లు తవ్వి ఎక్కడికక్కడ వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రోగాలు వస్తున్నాయని, వర్షం పడగానే చెరువుల్లా తయారవుతున్న రోడ్లు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజ్ వాటర్ గుంతలు ఎక్కడ ఎప్పుడు రోడ్లపై ఏమవుతుందో అర్థం కాదన్నారు. గోతులమయంగా మారిన రోడ్లతో ఇబ్బందులు పడుతున్నమంటూ వాపోతున్నారు. జీహెచ్ఎంసీ గుంతల రోడ్లపై ప్యాచ్‌వర్కు కూడా చేయడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీర్ పేట్ వామ్మో.. రహదారి మాత్రం దారుణాతి దారుణం

మీర్ పేట్ చౌరస్తా నుంచి జిల్లెల గూడ వచ్చే ప్రధాన రహదారి మధ్యలో రెడ్డి టిఫిన్ సెంటర్ (పాతది), శ్రీ సాయిరాం బేకరీ వద్ద రహదారి విస్తరణ చేయలేదు. రహదారి చిన్నగా ఉంటుంది. పెద్ద పెద్ద గుంతలు పడి వాహనదారులను తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా ఎనీ టైం రద్దీగా ఉండి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక డెలివరీ అయ్యే వారు ఈ రహదారిలో ప్రయాణిస్తే అక్కడే డెలివరీ కావాల్సిన పరిస్థితి. ఆస్పత్రి పాలయ్యే పరిస్థితి నెలకొంది. రహదారి మాత్రం దారుణాతి దారుణంగా తయారైంది. ఇక వెన్నునొప్పి నడుము నొప్పి ఉన్నవాళ్లు ఈ రహదారిలో ప్రయాణిస్తే ఏకంగా ఆస్పత్రిలో జాయిన్ అయ్యే పరిస్థితి. అధికారులు అర్థం చేసుకోండి ఎంత సమస్య ఉందో. ఇక జిల్లెలగూడ నుంచి మీర్ పేట వెళ్లే రహదారి మధ్యలో ఎస్.వి.డి లిక్కర్ మార్ట్ వద్ద సాయంత్రం అయితే చాలు రహదారి ఆనుకొని ద్విచక్ర వాహనాలు పార్క్ చేస్తుంటారు. వర్షం వచ్చిందంటే చాలు ఇక్కడ ఒక చెరువే దర్శనమిస్తుంది . వాహనదారులు, పాదాచారులు ఈ రహదారిలో బిక్కు బిక్కుమంటూ ప్రయాణిస్తుంటారు. ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలవుతుంటారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించి రహదారి విస్తరణ, రోడ్డు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!