ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeమహేశ్వరంకేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయడం దురదృష్టకరం 

కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయడం దురదృష్టకరం 

📰 Generate e-Paper Clip

400 పడకల ఆస్పత్రి, మెడికల్ కాలేజ్, మెట్రో రైలు ప్రాజెక్టులను పునరుద్ధరించి పనులను ప్రారంభించాలి

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య : 

మాజీ ముఖ్యమంత్రి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో నేడు ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం, అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరు చేసిన 400 పడకల ఆస్పత్రి, మెడికల్ కాలేజ్, మెట్రో రైలు ప్రాజెక్టులను రద్దు చేయడం దురదృష్టకరం అని ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి పట్ల నిజమైన చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే 400 పడకల ఆస్పత్రి, మెడికల్ కాలేజ్, మెట్రో రైలు ప్రాజెక్టులను పునరుద్ధరించి పనులను ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజల ఆరోగ్యం, విద్య, రవాణా సౌకర్యాల కోసం ఈ ప్రాజెక్టులు అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!