మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండలం, వావిళ్ళపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ జక్కార్తి రాజు అరుణ దంపతుల ముద్దుల కూతురు, కుమారుడు, జక్కార్తి నరసింహ, సుగుణమ్మ మనుమరాలు, మనమడు వైష్ణవి, ఆదర్శ్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం వావిళ్ళపల్లి గ్రామంలోని ఎల్ ఫంక్షన్ హాల్ లో కుటుంబ సభ్యుల, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు గ్రామం ప్రజల మధ్య ఘనంగా కనుల పండుగగా నిర్వహించారు.

నూతన పట్టు వస్త్రాల అలంకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు నాయనమ్మ , తాత జక్కార్తి సుగుణమ్మ నరసింహ, అమ్మమ్మ తాత సాయమ్మ యాదయ్య, మేనమామ బొమ్మ కంటి స్వామి, బావ చెల్లె బొమ్మకంటి జానీ శైలజ, తమ్ముళ్లు రవి, పరమేష్ , మరదళ్ళు సుకన్య, లాస్య శ్రేయోభిలాషులు, స్నేహితులు, సన్నిహితులు, వావిళ్ళపల్లి గ్రామ వాసులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. అక్కా వైష్ణవి, తమ్ముడు ఆదర్శ్ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించారు.

