ప్రారంభించునున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మియాపూర్ గండిమైసమ్మ వాసులకు గుడ్ న్యూస్
ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్‌కు చెక్!
147 కోట్ల వ్యయంతో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం
మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
మియాపూర్ గండి మైసమ్మ వాసులకు తీపికబురు. ప్రారంభానికి సిద్ధమైన మరో పెద్ద ఫ్లైఓవర్. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పూర్తిగా చెక్ పడనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 2026 జూన్ 8న బాచ్చుపల్లి ఫ్లైఓవర్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. 147 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ 1.3 కిలోమీటర్ల పొడవు నాలుగు నుంచి ఆరు లేన్ల వెడల్పుతో , మియాపూర్, నిజాంపేట్, మల్లంపేట్, గాంధీ మైసమ్మ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో నిర్మితమైంది. కీలక ప్రాజెక్ట్ వివరాల లోకి వెలితే ₹ 147 కోట్లు ఖర్చుతో 1.3 కి.మీ, 4 నుండి 6 లేన్లతో ఈఫ్లైఓవర్ ను నిర్మించారు.అత్యంత రద్దీగా ఉండే బాచుపల్లి, నిజాంపేట్ మార్గాలను సులభతరం చేస్తుంది. మియాపూర్ ఇతర ఐటీ కారిడార్లకు నిరంతరాయ అనుసంధానాన్ని కల్పిస్తుంది ఈ ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో పాటు, ముఖ్యమంత్రి పలు ఇతర స్థానిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో ఇవి ఉన్నాయి. మియాపూర్ ఫ్లైఓవర్, బాచుపల్లి-మియాపూర్ క్రాస్‌రోడ్స్ అండర్‌పాస్, ఆల్విన్ క్రాస్ రోడ్స్–హఫీజ్‌పేట్ అండర్‌పాస్, లను ముఖ్యమంత్రి ఈ నెల 8న అధికారికంగా ప్రారంభించనున్నారు. కొత్తగా నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి సుమారు ₹ 147 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 1.3 కిలోమీటర్ల, నాలుగు లేన్ల ద్విదిశాత్మక ఫ్లైఓవర్, వేలాది మంది ప్రయాణికులకు సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందించడంతో పాటు తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యాన్ని కలిగి ఉంది.
కీలక వివరాలు & మార్గం ప్రయోజనాలు
మియాపూర్ సిగ్నల్స్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లైఓవర్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. నిరాటంకమైన అనుసంధానంతో ఈ ప్రాజెక్ట్ మియాపూర్, నిజాంపేట్, మల్లంపేట్, బోవరంపేట్ మరియు గండి మైసమ్మ వైపు ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న వాయువ్య హైదరాబాద్ కారిడార్లకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో 1.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ డెక్‌తో పాటు, ప్రాంతీయ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ఎగ్జిట్ 4 A ర్యాంపులు మరియు బచుపల్లి–మల్లంపేట రోడ్డు అభివృద్ధి కూడా ఉన్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మియాపూర్ ఫ్లైఓవర్, బాచుపల్లి–మియాపూర్ క్రాస్‌రోడ్స్ అండర్‌పాస్, మరియు ఆల్విన్ క్రాస్ రోడ్స్–హఫీజ్‌పేట్ అండర్‌పాస్‌లతో సహా ఈ ప్రాంతంలోని అదనపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తారు.

ట్రాఫిక్ కష్టాలకు ఇక శాశ్వత చెక్
నిమిషాల్లోనే గమ్యస్థానానికి సాఫీ ప్రయాణం.. భాగ్యనగర వాసుల దశాబ్దాల కల ఇక సాకారం కానుంది. నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి తీపి కబురు. విశ్వనగరంగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్న ఈ వంతెన అందుబాటులోకి వస్తే గంటల తరబడి సాగే ట్రాఫిక్ నరకానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు మియాపూర్ – గండి మైసమ్మ రహదారిలోని బాచుపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రూ.65.53 కోట్లతో నిర్మించిన 1.3 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. రంగులు, లైటింగ్ వంటి తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ 4 లైన్ల పైవంతెన అందుబాటులోకి వస్తే బాచుపల్లి చౌరస్తాలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుంది. దీనివల్ల పీక్ అవర్స్‌లో వాహనదారులకు కనీసం 20 నిమిషాల సమయం ఆదా అవ్వడమే కాకుండా.. రాబోయే 20 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలు తీరనున్నాయి. ఐటీ కారిడార్ వైపు వెళ్లే ఉద్యోగులు, ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ ఎమ్ డి ఏ మరో కీలక ప్రాజెక్టును పూర్తి చేసింది. మియాపూర్ – గండిమైసమ్మ కారిడార్‌లో కీలకమైన, రద్దీ ప్రాంతమైన బాచుపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద నూతన పైవంతెన నిర్మాణ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఫ్లైఓవర్‌పై రంగులు వేయడం, అత్యాధునిక లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు, సైన్‌బోర్డుల అమరిక వంటి చిన్నచిన్న పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తి చేసి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్‌ను ఘనంగా ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
సిగ్నల్ ఫ్రీ ప్రయాణం
నగరంలో సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నిత్యం ప్రయాణికులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల సమయం, అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత ఐటీ కంపెనీలకు, మియాపూర్ వైపు వెళ్లే వాహనాలతో బాచుపల్లి చౌరస్తా నరకాన్ని తలపిస్తోంది. ఈ కూడలి వద్ద సిగ్నల్ పడితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయేవి. ఈ తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల బాచుపల్లి చౌరస్తాలో పూర్తిగా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా వాహనాలు సాఫీగా సాగిపోవచ్చు.

సమయం ఆదా
ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో మియాపూర్ నుంచి నిజాంపేట, మల్లంపేట, ప్రగతినగర్, గండి మైసమ్మ వైపు ప్రయాణించే వారికి ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల విలువైన సమయం ఆదా కానుంది. నిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడే ఐటీ ఉద్యోగులకు, స్థానిక కాలనీల నివాసితులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. కేవలం ప్రస్తుత అవసరాలనే కాకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందించారు. బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో రాబోయే 20 సంవత్సరాల పాటు పెరిగే ట్రాఫిక్ అవసరాలను తీర్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని డిజైన్ చేసినట్లు హెచ్ఎండీఏ స్పష్టం చేసింది. ఫ్లైఓవర్ మొత్తం పొడవు 1.3 కిలోమీటర్లు కాగా.. వెడల్పు 17.5 మీటర్లు. 4 లేన్ల క్యారేజ్‌వేతో విశాలమైన రహదారిగా దీన్ని నిర్మించారు. వయాడక్ట్ భాగం 545 మీటర్లు ఉండగా.. మొత్తం వ్యయం రూ. 65.53 కోట్లు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే హైదరాబాద్ ఐటి కారిడార్ రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మరింత ఊపునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

